హైదరాబాద్, జూలై 10 : జీఎమ్మార్ హైదరాబాఆద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్).. ఈఎస్ఆర్ జీఎమ్మార్ లాజిస్టిక్స్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్(ఈజీఎల్‌పీపీఎల్)లో పూర్తి వాటాను హస్తగతం చేసుకున్నది. గతంలో 30 శాతం కొనుగోలు చేసిన సంస్థ.. తాజాగా మిగతా 70 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది.
హైదరాబాద్‌లో గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్‌లను అభివృద్ధి చేయడానికి 2020లో జీహెచ్‌ఏఎల్, ఈఎస్సార్ హైదరాబాద్‌లు సంయుక్తంగా ఈజీఎల్పీపీఎల్ను ఏర్పాటు చేశాయి.