Home Loan | మీరు ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. హోంలోన్ ద్వారా సొంతింటి కల సాకారం చేసుకునే వారికి ప్రస్తుతం మంచి తరుణం.. తక్కువ వడ్డీరేట్ 6.5 శాతానికే ఇంటి రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి రుణం అంటే దీర్ఘకాలికంగా.. 15 నుంచి 20 ఏండ్ల పాటు కొనసాగుతుంది. హోంలోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ వివిధ బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీరేట్లు, ఇతర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. భార్యాభర్తలు కలిసి ఇంటి రుణం తీసుకుంటే మహిళా రుణ గ్రహీతలకు బ్యాంకులు ప్రిఫరెన్షియల్ వడ్డీరేట్లు.. అంటే అమల్లో ఉన్న వడ్డీరేట్లలో రాయితీ ఇస్తున్నాయి.
హోంలోన్లు ఇచ్చే బ్యాంకులు పెట్టే నిబంధనలు, వడ్డీరేట్లను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని బ్యాంకుల నిబంధనలు మాత్రమే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉన్నాయి. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఐదు మాత్రమే తక్కువ వడ్డీరేటుపై ఇంటి రుణాలిస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం రెపోలింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రకారం కనిష్టంగా 6.4 శాతం, గరిష్ఠంగా 7.25 శాతానికి ఇంటి రుణం ఆఫర్ చేస్తున్నది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.8 శాతం రెపోలింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రకారం కనిష్టంగా 6.4 శాతం, గరిష్టంగా 7.8 శాతంపై హోంలోన్ అందిస్తున్నది.
బ్యాంక్ ఆఫ్ బరోడా 6.5 శాతం రెపోలింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రకారం.. కనిష్ఠంగా 6.5 శాతం, గరిష్ఠంగా 7.85 శాతంపై హోంలోన్ మంజూరు చేస్తున్నది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం రెపోలింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రకారం 6.5 శాతం కనిష్ట, 8.2 శాతం గరిష్ట వడ్డీరేటుపై రుణాలిస్తున్నది.
కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.5 శాతం రెపోలింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) ప్రకారం కనిష్టంగా 6.55, గరిష్ఠంగా 7.1 శాతం వడ్డీరేటుపై హోంలోన్ ఆఫర్ చేస్తున్నది.
ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మంచి క్రెడిట్ స్కోర్ మెయింటెన్ చేస్తూ ఉండాలి. క్రెడిట్ స్కోర్ అద్బుతంగా ఉంటే తక్కువ వడ్డీరేటుపై ఇంటి రుణాలు పొందొచ్చు.
మహిళా రుణ గ్రహీతను సహ-దరఖాస్తుదారుగా పెట్టుకుంటే వడ్డీరేటులో 0.05 శాతం తగ్గుతుంది.