Axis Bank Credit Cards | ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్.. మొబైల్ యాప్స్ ఆధారిత యూపీఐ పేమెంట్స్.. నెట్‌బ్యాంకింగ్.. మొబైల్ బ్యాంకింగ్ పేమెంట్స్.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి బ్యాంకులు మొదలు కార్పొరేట్ సంస్థలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్.. ఒక్కటేమిటి ప్రతి ప్రొడక్ట్ సేల్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, కూపన్ రివార్డులు అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లు కూడా ఇప్పుడు ప్రతి డిజిటల్ పేమెంట్‌పై క్యాష్‌బ్యాక్, కూపన్, ఓచర్ రివార్డులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే కస్టమర్లకు ఆన్లైన్ షాపింగ్ బ్రాండ్లు ఫేవరెట్లుగా మారుతున్నాయి. తమ కస్టమర్లను కాపాడుకోవడానికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు సదరు బ్రాండ్లకు గేమ్ చేంజర్‌గా నిలుస్తున్నాయి. ఆర్థిక రంగంలో అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి క్యాష్‌బ్యాక్, రివార్డులు, డిస్కౌంట్లు తప్పనిసరిగా మారాయి. ఇందుకోసం యాక్సిస్ బ్యాంక్‌తో గూగుల్‌పే పార్టనర్షిప్ కుదుర్చుకుంది. యాక్సిస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కస్టమర్ల అన్ని అవసరాలకు, బిల్లు చెల్లింపులపైన ఐదు శాతం క్యాష్‌బ్యాక ఆఫర్ అందిస్తోంది గూగుల్ పే.
ఇందుకు కస్టమర్ చేయాల్సిందల్లా యాక్సిస్ బ్యాంక్ ఏసీఈ క్రెడిట్ కార్డు లేదా యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డు తీసుకోవాలి. ఈ రెండు క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక ఆఫర్లు అపరిమితం. ఉదాహరణకు ఈ రెండు క్రెడిట్ కార్డులతో కస్టమర్లు చేసే బిల్లులపై క్యాష్ బ్యాక్ పొందొచ్చు. దాదాపు రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ కూడా క్రెడిట్ కార్డు అకౌంట్‌కు నేరుగా యాక్సిస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ రెండు యాక్సిస్ క్రెడిట్ కార్డుల్లో లభించే ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..!
గూగుల్‌పేతో బిల్లుల చెల్లింపులు, డీవీఆర్ రీచార్జ్, టాప్ అప్ మొబైల్ ఫోన్ల రీచార్జీపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్.
జొమాటో, స్విగ్గీ, ఓలా బుకింగ్స్‌పై నాలుగు శాతం క్యాష్‌బ్యాక్.
ఇతర కొనుగోళ్లపై రెండు శాతం క్యాష్‌బ్యాక్. గరిష్ట పరిమితుల్లేవు.
45 రోజుల్లో రూ.10 వేలు ఖర్చు చేస్తే జాయినింగ్ ఫీజు వాపస్.
ఏడాదిలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మాఫీ.
ఏడాదిలో నాలుగు సార్లు విమానాశ్రయాల్లో దేశీయ లాంజ్ల్లోకి ప్రవేశం ఉచితం.
అన్ని పెట్రోల్ బంకుల వద్ద రూ.400-రూ.4000 మధ్య పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలుపై ఫ్యుయల్ సర్ చార్జీ ఒకశాతం మాఫీ. నెలలో గరిష్టంగా రూ.500 మాఫీ.
డైనింగ్ బెనిఫిట్లు.. నాలుగువేలకు పైగా రెస్టారెంట్లలో బిల్లుల చెల్లింపుపై 20 శాతం డిస్కౌంట్.
యుటిలిటీ బిల్లులు, రోజువారీ ఖర్చుల చెల్లింపుల కోసం యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ ప్లస్ క్రెడిట్ కార్డు డిజైన్ చేశారు. కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లకు యాక్టివేట్ బ్రాండ్-స్పెషిఫిక్ గిఫ్ట్ కార్డులు అదనం. ఈ కార్డు రిజిస్ట్రేషన్ ఖర్చు రూ.350. నెలవారీ ఫైనాన్స్ చార్జీలు 3.4 శాతం. కార్డు యాక్టివేషన్‌పై గిఫ్ట్ కూపన్లు.. ప్రతి లావాదేవీపై క్యాష్‌బ్యాక్‌తోపాటు డైనింగ్ డిలైట్ ప్రోగ్రామ్ మెంబర్షిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వార్షిక ఖర్చు రూ.50 వేలు దాటితే వార్షిక ఫీజు రూ.350 మాఫీ.
ప్రతి కొనుగోలుపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్.
ఓలా లేదా ఉబెర్ క్యాబ్ బుకింగ్‌పై రెండు శాతం
ఇతర కొనుగోళ్లపై ఒకశాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్.