ముంబై, మే 13: ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన నెలలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 4.62 శాతం తగ్గి 2,037.06 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 2,135.7 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు ఎగుమతి అయ్యాయి. అలాగే కట్ అండ్ పాలిష్ డైమండ్ల ఎగుమతులు 6.12 శాతం తగ్గి 1,108.74 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వెల్లడించింది.
గత నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు కూడా 5.41 శాతం తగ్గి 684.51 మిలియన్ డాలర్లకు తగ్గగా..వెండి ఆభరణాల ఎగుమతులు కూడా 12 శాతం దిగి 38.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.