జీసీసీ బాస్‌లకు గిరాకీ
దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అధిపతులకు గిరాకీ భలేగా నడుస్తున్నది. ప్రధాన బహుళజాతి సంస్థలు.. తమ జీసీసీ సెంటర్లలో బాస్‌లుగా పనిచేసేవారికి భారీ ఎత్తున జీతాలిచ్చేందుకు సై అంటున్నాయి మరి. ఏటా ఏకంగా రూ.3 కోట్ల నుంచి 6 కోట్లదాకైనా ఇచ్చేందుకు వెనుకాడటం లేదిప్పుడు.
- రూ.6 కోట్ల జీతమైనా ఇస్తాం
- ముందుకొస్తున్న బహుళజాతి సంస్థలు
- దేశంలో ఏఐ, ఎంఎల్, ఇతరత్రా టెక్నాలజీల్లో ప్రావీణ్యానికి పెద్దపీట
- విదేశాల్లోని భారతీయ అనుభవజ్ఞులనూ రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు
న్యూఢిల్లీ, మే 24: దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అధిపతులకు గిరాకీ భలేగా నడుస్తున్నది. ప్రధాన బహుళజాతి సంస్థలు.. తమ జీసీసీ సెంటర్లలో బాస్‌లుగా పనిచేసేవారికి భారీ ఎత్తున జీతాలిచ్చేందుకు సై అంటున్నాయి మరి. ఏటా ఏకంగా రూ.3 కోట్ల నుంచి 6 కోట్లదాకైనా ఇచ్చేందుకు వెనుకాడటం లేదిప్పుడు. పరిశ్రమ వర్గాల వివరాల ప్రకారం జీసీసీల్లో అత్యున్నత స్థాయిల్లో పనిచేసేందుకు అనుభవమున్నవారు కరువయ్యారు. ఇక భారత్‌లో జీసీసీ కార్యకలాపాలకున్న డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నదో తెలిసిందే. దీంతో టాప్ ప్లేస్‌కు ఎంతైనా వెచ్చించేందుకు యాజమాన్యాలు సిద్ధపడుతున్నాయి.
గత రెండేండ్లుగా..
గత రెండేండ్ల నుంచి దేశంలో చాలావరకు జీసీసీలు వ్యూహాత్మకంగా విస్తరణ బాట పడుతున్నాయి. అయితే సరైన నాయకత్వ లోపం వీటికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నది. ప్రస్తుత పోటీ మార్కెట్లో ఈ పరిణామం.. మొదటికే మోసం తెస్తుందేమోనన్న భయంతో టాలెంట్‌ను ఒడిసి పట్టుకునేందుకు జీతాలను క్రమేణా పెంచుతూపోతున్నాయి. చివరకు కొన్ని జీసీసీల్లో ఎండీలకు ఏటా రూ.8 కోట్లపైనే ఇస్తుండటం గమనార్హం. ఈ మేరకు ఉద్యోగుల అన్వేషణ సంస్థ ఫెనో చెప్తున్నది. కొన్ని సంస్థలైతే ఈ రంగంలో సీనియర్లకు పూర్తి స్వేచ్ఛనూ ఇస్తున్నాయన్నది. వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ నాయకత్వ లోపాలను అధిగమిస్తున్నాయని అంటున్నది. నాలుగేండ్ల క్రితం ప్రముఖ జీసీసీల్లో ఏటా రూ.4 కోట్ల వేతనం తీసుకున్న ఉద్యోగులు.. ఇప్పుడు రూ.8 కోట్ల వేతనం తీసుకుంటున్నారని, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలతో ముడిపడి ఉన్న జీసీసీల్లో ఉద్యోగులు 20వేలకుపైగానే ఉన్నారని, వీటి యాజమాన్యాలు తమ జీసీసీ బాస్‌లకు రూ.8 కోట్లకుపైగా వార్షిక వేతనం ఇస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలూ పేర్కొంటున్నాయి.
- దేశంలోని భారీ జీసీసీల్లో 16-18 శాతం యాజమాన్యాలు తమ జీసీసీ అధిపతులకు ఏటా రూ.3 నుంచి 6 కోట్ల జీతాన్నైనా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. రెండేండ్ల కిందటిదాకా ఇందులో 10 శాతం కన్నా తక్కువే వేతనాలుగా వచ్చేవి.
- గత 3-4 ఏండ్లలో కొన్ని ప్రధాన జీసీసీల్లో వేతన ప్యాకేజీలైతే రెట్టింపై రూ.8.5 కోట్లకు పెరిగాయి.
- కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఇతరత్రా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యం ఉన్నవారిని వరిస్తున్న అధిక వేతనాలు.
- ప్రతిభావంతులు, నైపు ణ్యం కలిగిన అనుభవజ్ఞుల కొరత దృష్ట్యా విదేశాల్లో ఉన్న భారతీయులకూ దేశంలో పెరుగుతున్న ఆఫర్లు
- దేశంలోని జీసీసీల్లో 16 లక్షల మంది ఉద్యోగులుంటే.. దాదాపు 75 కంపెనీల్లోనే 11 లక్షల మంది పనిచేస్తున్నారు.
- వచ్చే రెండేండ్లకుపైగా కాలంలో దేశంలోని దాదాపు 1,800 జీసీసీలు సుమారు 5వేల ఉన్నతస్థాయి ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
- అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి.
- ప్రతిభ కలిగిన ఉద్యోగుల వేతనాల పెంపుపైనే దృష్టి సారిస్తున్న ప్రధాన జీసీసీలు.
- అమెరికా, ఐరోపా దేశాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులను అధిక వేతనం ఇచ్చిమరీ స్వదేశానికి తీసుకొస్తున్న జీసీసీ యాజమాన్యాలు.
ఏఐ, ఎంఎల్ విభాగాల్లో మారుతున్న టెక్నాలజీ నైపుణ్యాలకు అనుగుణంగా ప్రతిభావంతులు, అనుభవజ్ఞుల అవసరం ఉంటున్నది. వారిని ఎలాగైనా అందిపుచ్చుకోవడమే ఇప్పుడు దేశీయ జీసీసీల అత్యంత ప్రాధాన్యతాంశం. అందుకే పెద్ద మొత్తాల్లో జీతాలనిచ్చేందుకూ వెనుకాడటం లేదు. చివరకు విదేశాల్లో ఉన్న భారతీయ నిపుణులనూ ఇక్కడకు రప్పిస్తున్నాయి.
-మీనాక్షి థాకర్, ట్రాన్సెర్చ్ ఇండియా భాగస్వామి
భారత్‌లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో సీనియర్ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి. జీసీసీల విస్తరణ దృష్ట్యా నైపుణ్యం కలిగినవారికి డిమాండ్ ఏర్పడింది. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ వంటి అంశాల్లో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల అన్వేషణ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నది.
-జస్ప్రీత్ సింగ్, గ్రాంట్ థాంటర్ భారత్ భాగస్వామి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

