హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్(ఫైనాన్స్)గా జీ గాయత్రీప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బీడీఎల్లోనే జనరల్ మేనేజర్(ఫైనాన్స్)గా పనిచేసిన ఆయన.. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో కామర్స్ చదివారు.
1997లో బీడీఎల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన ఆయన..27 ఏండ్లపాటు అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టాక్సేషన్ విభాగాల్లో విధులు నిర్వర్తించారు.