Gautam Singhania – Nawaz Modi | తిండీ తిప్పల్లేకుండా తిరుమల మెట్లెక్కించాడు.. గౌతం సింఘానియాపై ఆయన భార్య నవాబ్ మోదీ
Gautam Singhania - Nawaz Modi | రేమండ్ గ్రూప్ సీఎండీ గౌతం సింఘానియా విడాకులు తీసుకోనున్న ఆయన భార్య నవాబ్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తిండీ తిప్పల్లేకుండా తిరుమల కొండ మెట్లెక్కించాడని ఆరోపించారు.
Gautam Singhania – Nawaz Modi | ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రేమండ్ గ్రూప్ సీఎండీ గౌతం సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ఓ సంచలన ఆడియో లీక్ బయటకు వచ్చింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళితే తిండీ తిప్పలు, కాళ్లకు చెప్పుల్లేకుండా బలవంతంగా తిరుమల మెట్లు ఎక్కించాడని గౌతం సింఘానియాపై నవాజ్ మోదీ ఆరోపణలు చేశారు.
‘ఒకవేళ తనను పెండ్లి చేసుకోవాలంటే తిరుమలలో శ్రీవారి దర్శనానికి మెట్లపై నుంచి కాలినడకతో వెళ్లాలని షరతు విధించాడు. ఆయన మాటకు కట్టుబడి కష్టమైనా బలవంతంగానే భోజనం, తాగునీరు లేకుండానే భయపడుతూ మెట్ల మీదుగా తిరుమల కొండపైకి వెళ్లానని చెప్పారు.
‘నన్ను ఆ మెట్లు ఎక్కించేందుకు సిద్ధం చేశాడు. నాకు తిరుమల కొండపైకి వెళ్లడానికి ఎన్ని మెట్లు ఉన్నాయో తెలియదు. కానీ, తిండీ తిప్పలు లేకుండా మెట్లెక్కాను. రెండు, మూడు సార్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. నా పట్ల కేర్ తీసుకునేలా కనిపించడం లేదు. నన్ను నడిపించాలనే చూశాడు’ అని ఆ ఆడియో క్లిప్‌లో కనిపిస్తున్నది.
కానీ, గౌతం సింఘానియా వాదన మరోలా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తన కుటుంబ సభ్యుల గోప్యత నేపథ్యంలోనే ఆ విషయాలపై చర్చించబోను అని చెప్పారు. ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళం, టీటీడీ విద్యా సంస్థల కార్యకలాపాల్లో ఆయన భాగస్వామ్యం ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

