హైదరాబాద్, ఫిబ్రవరి 3: సామ్సంగ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్25 ఫోన్ల విక్రయాలను రాష్ట్రంలో ప్రారంభించింది. హైదరాబాద్‌లోని మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ స్టోర్‌లో ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి అందచేశారు. ఈ కార్యక్రమంలో సామ్సంగ్ ప్రతినిధులు ఎస్కే నాగుర్మౌలా, రాజశేఖర్, సుధీర్ కుమార్‌తోపాటు మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ యజమాని సమీర్ మహ్మద్ కలిసి కస్టమర్‌కు తొలి ఫోన్లను అందచేశారు. మూడు రకాల్లో లభించనున్న ఈ ఫోన్ రూ.80,999 నుంచి రూ.1.29 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నాయి. వీటిలో ఎస్25 బేసిక్ మాడల్ 12జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ ప్రారంభ ధర రూ.80,999గాను, ఎస్25+ మాడల్ ప్రారంభ ధర రూ.99,999, అలాగే ఎస్25 అల్ట్రా మాడల్ 12జీబీ+256 జీబీ, 12జీబీ+51జీబీ, 12జీబీ+1టీబీ మాడల్ ధర రూ.1,29,999కి విక్రయించనున్నది.