హైదరాబాద్, జూన్ 13: ప్రముఖ రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ బిగ్”సి’ షోరూంలో సామ్‌సంగ్‌నకు చెందిన గెలాక్సీ ఏఐ సిరీస్ ఫోన్లు ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా బిగ్”సి’ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ.. సామ్సంగ్ గెలాక్సీ ఏఐ సిరీస్ ఫోన్లను సూపర్ సేల్‌లో భాగంగా శుక్రవారం నుంచి అన్ని రిటైల్ స్టోర్లలు అందుబాటులోకి తేనున్నట్లు, అత్యంత అధునాతనమైన ఫీచర్లతో రూపొందించిన ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.39,999గా ఉందని చెప్పారు. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసిన వారికి జీరో డౌన్ పేమెంట్, 24 నెలల్లో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మొబైల్ కొనుగోలుపై రూ.16 వేల వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్, రూ.18 వేల వరకు ఎక్సేంజ్ బోనస్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయని వివరించారు.