FPI Investments | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికవ్వడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటి వరకూ దేశీయ స్టాక్ మార్కె్ట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ.26,533 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించారు. దేశీయ కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు అంతంతే ఉండటంతోపాటు చైనా మార్కెట్లలో పెట్టుబడుల దిశగా విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తున్నది. అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ నెలలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తక్కువగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. ఓవరాల్గా ఇప్పటి వరకూ విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు నికరంగా రూ.19,940 బయటకు వెళ్లిపోయాయి.
సెప్టెంబర్ నెలలో దేశీయ మార్కెట్లలో రూ.57,724 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది కాలంలో ఇది తొమ్మిది నెలల గరిష్టం. ఈ నెల 22 నాటికి ఎఫ్ పీఐలు రూ.26,533 కోట్ల పెట్టుబడులు విత్ డ్రా చేస్తే గత నెలలో రూ.94,017 కోట్లుగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధాన నిర్ణయాలను బట్టి భవిష్యత్ పరిణామాలు ఉంటాయని విశ్లేషకులు చెప్పారు.