52 లక్షల కోట్లపైనే
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) నుంచి వచ్చిన పెట్టుబడుల విలువ 626 బిలియన్ డాలర్ల (రూ.52,03,312 కోట్లు)కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నాటికి ఈ స్థాయిలో ఉన్నాయని మార్నింగ్‌స్టార్ తాజా నివేదిక వెల్లడించింది.
- దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ
న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) నుంచి వచ్చిన పెట్టుబడుల విలువ 626 బిలియన్ డాలర్ల (రూ.52,03,312 కోట్లు)కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) నాటికి ఈ స్థాయిలో ఉన్నాయని మార్నింగ్‌స్టార్ తాజా నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) జూన్ ఆఖరుతో చూస్తే ఏడాది కాలంలో 20 శాతం వృద్ధి కనిపించింది. నిరుడు జూన్ 30కి 523 బిలియన్ డాలర్ల వద్ద ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ ఉందని, ఈ జూన్ 30కి 103 బిలియన్ డాలర్లు ఎగిసి 626 బిలియన్ డాలర్లకు చేరుకుందని వివరించింది.
3 నెలల్లో 84 బిలియన్ డాలర్లు
ఈ ఏప్రిల్-జూన్ వ్యవధిలో దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చారు. కేవలం ఈ 3 నెలల్లోనే ఏకంగా 84 బిలియన్ డాలర్లు (రూ.6,98,208 కోట్లు) పట్టుకొచ్చారు. ఈ ఏడాది మార్చి 31కి 542 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో 15 శాతం వృద్ధి నమోదైనట్టు తాజా నివేదికలో మార్నింగ్‌స్టార్ తెలిపింది. నిజానికి ఈ ఏడాది జనవరి-మార్చిలో భారతీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
అంతర్జాతీయ పరిస్థితులతో..
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే.. భారతీయ ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు దోహదపడ్డాయని మెజారిటీ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాలతోపాటు అమెరికా, ఐరోపాల్లో బ్యాంకింగ్ సంక్షోభం, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ గణాంకాలు, చైనా ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కలిసొచ్చాయని చెప్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?


