Reliance | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో రిలయన్స్ స్క్రిప్ట్ దూసుకెళ్లింది. దీంతోపాటు టాప్-10 స్టాక్స్‌లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,31,320.37 కోట్లు లాభ పడ్డాయి. గతవారం సెన్సెక్స్ 884.57 పాయింట్లు (1.61 శాతం) లాభ పడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభ పడ్డ స్టాక్స్‌లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఎల్ఐసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ రూ.68,140.72 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్ట్ రూ.1,38,222.46 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పుంజుకుని రూ.18,80,350.47 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.64,618.85 కోట్లు లాభపడి, దాని ఎం-క్యాప్ రూ.12,58,274.59 కోట్లకు చేరుకున్నది. మరో ఐటీ జెయింట్ ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,728.52 కోట్లు పెరిగి రూ.6,40,373.02 కోట్ల నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,750.54 కోట్లు పెరిగి రూ.5,17,049.46 కోట్ల వద్ద ముగిసింది.
భారతీ ఎయిర్టెల్ రూ.25,955.25 కోట్లు నష్టపోయి, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,76,972.75 కోట్లతో సరిపెట్టుకున్నది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.13,472.25 కోట్లు కోల్పోయి రూ.5,06,157.94 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,355.02 కోట్లు పతనమై రూ.4,13,299.36 కోట్ల స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.8,963.69 కోట్లు నష్టపోయి రూ.5,38,561.56 కోట్లకు చేరుకున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,199.94 కోట్లు నష్టపోయి రూ. 7,66,314.71 కోట్ల వద్ద ముగిసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.4,194.57 కోట్లు కోల్పోయి రూ.4,14,369.71కోట్ల వద్ద స్థిర పడింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-10లో రిలయన్స్ లీడ్ వహిస్తుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.