Market Capitalisation | దలాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లలో బలహీన సెంటిమెంట్స్ నేపథ్యంలో గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,25,397.45 కోట్లు కోల్పోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 428.87 పాయింట్లు (0.55శాతం), ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు (0.47 శాతం) నష్టపోయాయి. మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నా ఈక్విటీ మార్కెట్లు పుంజుకోలేకపోయాయి. ఫలితంగా వరుసగా మూడో వారం ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నష్టాలతో ముగిసిందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.74,969.35 కోట్లు నష్టపోయి రూ.16,85,998.34 కోట్లకు చేరుకుంది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ. 21,251.99 కోట్ల పతనంతో రూ.5,19,472.06 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.17,626.13 కోట్లు కోల్పోయి రూ.6,64,304.09 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.11,549.98 కోట్ల నష్టంతో రూ.8,53,945.19 కోట్లకు పరిమితమైంది.
మరోవైపు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,934.38 కోట్ల వృద్ధితో రూ.7,78,612.76 కోట్లకు చేరుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.9,828.08 కోట్లు పుంజుకుని రూ.12,61,627.89 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.9,398.89 కోట్ల వృద్ధితో రూ.9,36,413.86 కోట్ల వద్ద నిలిచింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,262.3 కోట్లు పెరిగి రూ.15,01,976.67 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.3,442.15 కోట్లు వృద్ధి చెంది రూ.5,56,594.67 కోట్లకు చేరుకుంది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.1,689.08 కోట్ల లబ్ధితో రూ.5,52,392.01 కోట్ల వద్ద ముగిసింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్ సంస్థగా రిలయన్స్ కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ, ఎల్ఐసీ నిలిచాయి.