న్యూఢిల్లీ, జూలై 30: స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి మరో నాలుగు సంస్థలు రెడీ అవుతున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్‌తోపాటు పీఎన్ గాడ్జిల్ జ్యూవెల్లరీస్ లిమిటెడ్, ఎకోస్ ఇండియా మొబిలిటీ, కేఆర్ఎన్ హీట్ ఎక్సేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ సంస్థల ఐపీవోలకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
వీటిలో ప్రీమియర్ ఎనర్జీ రూ.1,500 కోట్లు, పీఎన్ గాడ్జిల్ జ్యూవెల్లరీ రూ.1,100 కోట్లు, ఎకోస్ ఇండియా 250 కోట్లు, కేఆర్ఎన్ హీట్ భారీ స్థాయిలో నిధులను సమీకరించబోతున్నది.