న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కీలక పదవివరించింది. ప్రధాని నరేంద్ర మోదీ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రస్తుతం గుజరాత్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ పీకే మిశ్రా ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు.
తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అయిన దాస్ నియామకానికి ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి పదవికాలం ముగిసే వరకు లేదా తదుపరి ఉత్తర్యులు వచ్చేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 42 ఏండ్లుగా సివిల్ సర్వెంట్‌గా విధులు నిర్వహించిన ఆయన..25వ ఆర్బీఐ గవర్నర్‌గా విధులు నిర్వహించారు కూడా.