పీఎల్ఐ ఓ ఫ్లాప్ షో
దేశంలో తయారీ రం గాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్ విఫలమవుతున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తు న్న ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ సమర్థతను ప్రశ్ని స్తూ రాజన్ సోషల్ మీడియాలో ఒక రీసెర్చ్ నోట్‌ను పోస్ట్ చేశారు.
- మొబైళ్ల విడిభాగాలన్నీ దిగుమతి అవుతున్నవే
- తయారీ పేరుతో దేశంలో జరుగుతున్నది అసెంబ్లింగ్ మాత్రమే
- సబ్సిడీ స్కీమ్ నిరుపయోగం
- రఘురామ్ రాజన్ రీసెర్చ్ నోట్
న్యూఢిల్లీ, మే 30: దేశంలో తయారీ రం గాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్ విఫలమవుతున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తు న్న ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ సమర్థతను ప్రశ్ని స్తూ రాజన్ సోషల్ మీడియాలో ఒక రీసెర్చ్ నోట్‌ను పోస్ట్ చేశారు. ఈ సబ్సిడీలతో మొబైల్ ఫోన్ల తయారీ జరగడం లేదని, దిగుమతి అయిన విడిభాగాల అసెంబ్లింగ్ మాత్రమే చేస్తున్నారని వివరించారు. దేశంలో తయారీ సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన ఉద్దేశ్యంగా వివిధ రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల పీఎల్ఐ స్కీమ్‌లను కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ స్కీమ్‌ల అమలుతీరును వివరిస్తూ రాజన్‌తో పాటు మరో ఇరువురు ఆర్థికవేత్తలు రాహుల్ చౌహాన్, రోహిత్ లంబాలు ఈ రీసెర్చ్ నోట్‌ను రూపొందించారు.
నోట్ వివరాలు..
- పీఎల్ఐ పథకం ద్వారా ఎన్ని ఉద్యోగాలు లభించాయి? ఒక్కో ఉద్యోగానికి అయిన వ్యయం ఎంతో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వివరణాత్మక విశ్లేషణను నిర్వహించాల్సి ఉంది.
- ఐఏఎన్ఎస్ రిపోర్ట్ ప్రకారం 2014లో భారత్‌లో రెండు మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు ఉండగా, ఇప్పుడు 200కుపైగా ప్లాంట్లు ఏర్పాటయ్యాయి.
- దేశంలో మొబైళ్ల ఉత్పత్తికి ఊతమిచ్చేందుకు పూర్తి మొబైల్ ఫోన్ దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 2018లో సుంకాలు విధించింది.
- తదుపరి 2020లో మొబైల్ ఫోన్ల తయారీకి పీఎల్ఐ స్కీమ్ ప్రవేశపెట్టారు.
- పూర్తిగా తయారైన ఫోన్‌కే సబ్సిడీ అందించడమే పీఎల్ఐ స్కీమ్‌లో ప్రధాన లోపం. ఫోన్ తయారీలో ఉపయోగించే విడిభాగాల ఉత్పత్తిపై సబ్సిడీ అందదు.
- దీంతో ఇప్పటికీ మొబైల్ ఫోన్లకు కావాల్సినవన్నీ భారత్ దిగుమతి చేసుకుంటున్నది.
- మొబైళ్ల తయారీలో ఉపయోగించే సెమీకండక్టర్లు, పీసీబీఏలు, డిస్ప్లేలు, కెమెరాలు, బ్యాటరీలు తదితరాలు అన్నీ దిగుమతి అవుతున్నవే. వీటిలో ఏ ఒక్కదానినీ భారత్ ఎగుమతి చేయడం లేదు.
- పూర్తిగా తయారైన మొబైల్ ఫోన్ల ఎగుమతులు, పీసీబీఏలు, ఇతర మొబైల్ విడిభాగాల దిగుమతుల గణాంకాల్ని చూస్తే నికర ఎగుమతులు 2017 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 12.7 బిలియన్ డాలర్లుండగా, అవి 2023 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 21.3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
- ‘మొత్తంగా చెప్పాలంటే మనం పీఎల్ఐ స్కీమ్ హయాంలో దిగుమతులపై మరింతగా ఆధారపడ్డాం’ అని రాజన్, సహ ఆర్థికవేత్తలు చెప్పారు.
- దిగుమతైన సెమీ కండక్టర్లు, పీసీబీఏలు, డిస్ప్లేలు, లి-అయాన్ బ్యాటరీలు, బ్యాటరీ చార్జర్లు, కెమెరాలనే ఇక్కడ మొబైల్ తయారీలో ఉపయోగిస్తున్నారు.
- ఈ దిగుమతుల్ని తీసేస్తే మనం నికరంగా ఎగుమతి చేస్తున్నదేమీ లేదు. కేవలం అసెంబుల్ అయిన మొబైళ్ల ఎగుమతులు.. తయారీలో భారత్ నైపుణ్యానికి ప్రతీకగా చెప్పలేము.
- మొబైల్ ఉత్పత్తి వ్యయంలో అసెంబ్లింగ్ వ్యయం 4 శాతమే. ఇందుకు పీఎల్ఐ స్కీ మ్ ద్వారా 6 శాతం సబ్సిడీ ఇవ్వడాన్ని రఘురామరాజన్ తప్పుపడుతూ, ఈ స్కీమ్ పూర్తిగా విఫలమవుతున్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

