Forex Reserves | భారత్ ఫారెక్స్ నిల్వలు పుంజుకుంటున్నాయి. ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 1.634 బిలియన్ డాలర్లు పెరిగి 618.937 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం ఆర్బీఐ తెలిపింది. అంతకుముందు వారం 5.89 బిలియన్ డాలర్లు తగ్గి 617.3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ ఆధారంగా దేశీయ ఫారెక్స్ నిల్వలు ఆధార పడి ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.
ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ 1.859 బిలియన్ డాలర్లు పెరిగి 548.508 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. మరోవైపు గోల్డ్ రిజర్వ్స్ 242 మిలియన్ డాలర్లు పతనమై 47.247 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 12 మిలియన్ డాలర్లు పెరిగి 18.31 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు ఆరు మిలియన్ డాలర్లు పెరిగి 4.872 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.