ముంబై, డిసెంబర్ 30: వరుసగా రెండోవారంలోనూ విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 23తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 691 మిలియన్ డాలర్లు తగ్గి 562.81 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ 571 మిలియన్ డాలర్లు పడిపోయిన విషయం విధితమే.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ కరిగిపోవడం ఇందుకు కారణమని తెలిపింది. గత వారానికిగాను 1.134 బిలియన్ డాలర్లు తగ్గి 498.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కానీ, పసిడి రిజర్వులు మాత్రం 390 మిలియన్ డాలర్లు ఎగిసి 40.969 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అక్టోబర్ 2021లో ఫారెక్స్ రిజర్వులు రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే