Force Citiline | ఇప్పటి వరకు మనదేశంలో ఏడు, ఎనిమిది సీట్ల కారుకు మంచి గిరాకీ ఉంది. పెద్ద కుటుంబాల వారు, వాణిజ్య సంస్థల యజమానులు ఏడెనిమిది సీట్ల కార్లు సాధారణంగా వాడుతుంటారు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకితోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ వంటి పలు సంస్థలు ఏడెనిమిది సీట్ల కార్లు విక్రయిస్తున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్లోకి పది సీట్ల కారు వచ్చేసింది. భారత్ కార్ల తయారీ సంస్థ ఫోర్స్ బ్రాండ్ మోటార్స్.. సిటీ లైన్ పేరుతో పది సీట్ల కారు తీసుకొచ్చింది. ఈ కారు ఫీచర్లు.. ధరవరల వివరాలపై ఓ లుక్కేద్దామా..!