వృద్ధి రేటుకు ఊతమిచ్చే మేథో సంపత్తి హక్కులు : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : వృద్ధి రేటును బలోపేతం చేయడంలో మేథో సంపత్తి హక్కులు (ఐపీఆర్) కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2013-14లో 4000 పేటెంట్లు మంజూరు కాగా గత ఏడాది 28,000 పేటెంట్లు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
గత ఏడాది 2.5 లక్షల ట్రేడ్‌మార్క్‌లు, 16,000 కాపీరైట్లు నమోదయ్యాయని, ఇది ఆర్ధిక వ్యవస్ధపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు. ఇవి చిన్న గణాంకాలు కాదు..ఇవి మన ఆర్ధిక వ్యవస్ధ పటిష్టతకు సంకేతమని వ్యాఖ్యానించారు.
ఇంత భారీస్ధాయిలో కాపీరైట్లు, వినూత్న పోకడలతో ఆర్ధిక వ్యవస్ధలో ఉత్తేజం నెలకొంటుందని, వీటి ద్వారా భారీ రాబడులు సమకూరుతాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటూ మేథో సంపత్తి హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- FM
- growth
- Nirmala Sitharaman
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

