వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు తప్పని నిరాశ.. స్టాండర్డ్ డిడక్షన్స్ మాటే లేదు..

Work from Home allowance | కేంద్ర బడ్జెట్‌పై ముందు నుంచి వేతన జీవులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపులు లేదా రాయితీలు ఇవ్వడంతో పాటు.. వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులకు శుభవార్త చెబుతారేమో అని ఆశించారు. స్టాండర్డ్ డిడక్షన్స్ పరిమితి పెంచుతారని.. వర్క్ ఫ్రం హోమ్ అలవెన్స్‌లపై ప్రకటన ఉంటుందని అనుకున్నారు. కానీ వారి ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. ఆయా ఆంశాల ఊసే ఎత్తకపోవడం వారిలో తీవ్ర అసంతృప్తిని నింపింది.
కరోనా మహమ్మారి కారణంగా చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రారంభించాయి. దీనివల్ల ఆఫీసుకు వెళ్లడం తగ్గినప్పటికీ.. ఉద్యోగులపై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా మొబైల్ ఛార్జీలు, ఫర్నీచర్, విద్యుత్, ఇంటర్నెట్ తదితర ఖర్చులతో జేబులకు చిల్లు పడుతుంది. దీంతో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపించాయి. ఈ డిమాండ్లకు అనుగుణంగా వేతన జీవులకు కేంద్రం ఊరట కల్పిస్తుందని అంతా భావించారు. స్టాండర్డ్ డిడక్షన్స్ పరిమితి పెంపుతో పాటు వర్క్ ఫ్రం హోం అలవెన్సులు అందించడం లేదా ఆదాయపు పన్నుపై మినహాయింపు ఇస్తారని ఆశలుపెట్టుకున్నారు. కానీ మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరాశే ఎదురైంది.
కేంద్ర ప్రభుత్వం 2018లో స్టాండర్డ్ డిడక్షన్‌ను తీసుకొచ్చింది. చాలామంది ఉద్యోగులు దీన్ని ఎంచుకున్నారు. అయితే దీనికిందకు వర్క్ ఫ్రం హోమ్ అలవెన్సులు రావు. దీంతో స్టాండర్డ్ డిడక్షన్స్ పరిమితి పెంచాలని లేదంటే.. కొత్త డిడక్షన్ ప్లాన్ ప్రవేశపెట్టాలనే విజ్ఞప్తులు వచ్చాయి. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలని కోరారు. దీనిపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన ఉంటుందని ఆశించారు. ఉద్యోగులకు అనుకోని రీతిలో ఎదురైన కొత్త ఖర్చుల దృష్ట్యా.. వర్క్ ఫ్రం హోం అలవెన్సులకు పన్ను మినహాయింపు అందించాలని కేంద్రాన్ని కోరుతూ ఇన్స్టిట్యూట్ ఆప్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా పలు ప్రతిపాదనలు చేసింది. నాస్కామ్ సహా డెలాయిట్ ఇండియా కూడా ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వీటిని పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతుందని అనుకున్నారు. కానీ వీటిపై బడ్జెట్లో ఏ ప్రకటన చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీటి ఊసెత్తకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
టూరిస్టులకు తెలంగాణ టూరిజం కార్పోరేషన్ బంపర్ ఆఫర్.. అగ్గువ కిరాయికి కార్లు, బస్సులు..!
Fiscal deficit: 2022-23 జీడీపీలో 6.4 శాతానికి ఆర్థిక లోటు.. లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం..!
ఇక మీ పాస్‌పోర్టుల్లో చిప్ ఉంటుంది.. ఒకవేళ ఆ చిప్ ట్యాంపర్ అయితే ఎలా?
Duty Rise on Jewellery Import | జ్యువెల్లరీ దిగుమతులపై సుంకాలు పెంపు.. నిర్మల
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

