టూరిస్టులకు తెలంగాణ టూరిజం కార్పోరేషన్ బంపర్ ఆఫర్.. అగ్గువ కిరాయికి కార్లు, బస్సులు..!
Telangana Tourism: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల్లోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా టీఎస్‌టీడీసీ నుంచి వాహనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు బస్సులు, ఆటోల ద్వారా వెళ్లిరావచ్చు. కానీ కొన్ని ప్రాంతాలకు ఆ సౌకర్యాలు లేవు. ప్రత్యేకంగా వాహనాన్ని మాట్లాడుకుని వెళ్లాల్సి వస్తుంది. అందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తే వాహనం కిరాయి తడిసి మోపెడు అవుతుంది. కొంచెం స్థితిమంతులకు అది పెద్ద సమస్య కాదు, కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు వాహనాల బాడుగ భరించలేరు.
అలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల్లోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా టీఎస్‌టీడీసీ నుంచి వాహనం అద్దెకు దొరుకుతుంది. అందులో కారు నుంచి బస్సు వరకు అన్ని రకాల వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఎవరి ఆర్థిక స్తోమతకు తగినట్లు వాళ్లు వాహనాన్ని ఎంచుకోవచ్చు, అదేవిధంగా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా నాలుగు సీట్ల నుంచి అరవై సీట్ల వరకు అనువైన వాహనాన్ని అద్దెకు తీసుకోవచ్చు.
ఏడు సీట్ల ఏసీ కారవాన్ వాహనాలు..
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పర్యాటకులు ప్రజారవాణా వాహనాల్లో కంటే ప్రత్యేక వాహనాల్లో వెళ్లడమే ఉత్తమం. పైగా టీఎస్‌టీడీసీ ఇచ్చే వాహనాల అద్దె ప్రైవేటు ట్రావెల్స్ వారి వాహనాల అద్దెకంటే చాలా అగ్గువ. ఈ టీఎస్‌టీడీసీ వాహనాల్లో ఏడు సీట్ల సామర్థ్యం గల ఏసీ కారవాన్ వాహనాలు ప్రత్యేకమైనవి. వీటిలో ఆధునిక టాయిలెట్, షవర్, రెండు ఎల్ఈడీ స్క్రీన్లు, రిఫ్రిజిరేటర్‌తో కూడిన చిన్న కిచెన్ ఏరియా సౌకర్యాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు వీటిలోని సీట్లను సోఫాలుగా, బెడ్లుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంంది.
ఏసీ కారవాన్ వాహన ప్యాకేజీలు..
- 8 గంటలు – 80 కిలోమీటర్ల వరకు దూరానికి రూ.4000
- 12 గంటలు – 200 కిలోమీటర్ల దూరానికి రూ.6000
- దూరప్రాంతాలకు వెళ్తే కిలోమీటర్‌కు రూ.35, కనీసం 300 కిలోమీటర్లకు కిరాయి చెల్లించాలి.
- ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.25, ప్రతి అదనపు గంటకు రూ.300 అదనంగా చెల్లించాలి.
- టూర్ ప్రారంభానికి ముందే ఆ టూర్ అంచనా ఖర్చులో 20 శాతం అదనంగా రీఫండబుల్ కాషన్ డిపాజిట్ చెల్లించాలి.
- అవుట్ స్టేషన్ టూర్లకు చెల్లించాల్సిన జీఎస్టీని, మోటార్ వెహికల్ ట్యాక్స్‌ను వినియోగదారుడే భరించాలి.
- టోల్ గేట్ చార్జీలు, పార్కింగ్ చార్జీలు కూడా వినియోగదారుడే భరించాలి.
ఇండికా కారు నుంచి వోల్వో బస్సు వరకు..
ఈ ఏసీ కారవాన్ వాహనాలేగాక కస్టమర్ అవసరానికి తగ్గట్లు ఏ వాహనాన్నైనా టీఎస్‌టీడీసీ సమకూర్చగలదు. ఇండికా, ఇన్నోవా కార్ల నుంచి టూరిస్టు బస్సుల వరకు అన్ని రకాల వాహనాల నెట్వర్క్ టీఎస్‌టీడీసీకి ఉంది. దేశంలో ట్రావెలర్స్ కోసం సూపర్ లగ్జేరియస్ బెంజ్ కార్లు, బోల్వో బస్సులను అందుబాటులోకి తెచ్చిన తొలి టూరిజం డిపార్టుమెంటుగా తెలంగాణ టూరిజం డిపార్టుమెంటు గుర్తింపు పొందింది. మరింత సమాచారం కోసం 9705597706 ఫోన్ నెంబర్లో లేదంటే https://tourism.telangana.gov.in/package/VehicleHire వెబ్సైట్లో సంప్రదించవచ్చు.
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

