ఫిక్స్డ్ రేటు
Home Loans | మనం తీసుకున్న గృహ రుణంపై వడ్డీరేటు ఫిక్స్‌డ్‌గా ఉంటే.. రుణ కాలపరిమితి మొత్తం ఒకే రకమైన వడ్డీరేటు ఉంటుంది. దీంతో ఈఎంఐ (నెలవారీ వాయిదా మొత్తాలు)ల్లో ఎలాంటి మార్పులూ ఉండవు. అయితే కొన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు కొంత కాలం తర్వాత ఫిక్స్డ్ రేటును ఫ్లోటింగ్ రేటుగా మార్చుకునేందుకు రుణగ్రహీతలకు అవకాశం ఇస్తున్నాయి.
ఫ్లోటింగ్ రేటు
తీసుకున్న హోమ్ లోన్‌పై ఫ్లోటింగ్ వడ్డీరేటు ఉంటే.. రుణ కాలపరిమితిలో వడ్డీరేట్లు మారుతూ ఉంటాయి. మార్కెట్ ఒడిదొడుకులు, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు ఆధారంగా వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులకు వీలుంటుంది. దీనివల్ల రుణ గ్రహీతలు చెల్లించే ఈఎంఐలు కూడా ఎక్కువ, తక్కువ అవుతుంటాయి. లేదా రుణ కాలపరిమితి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది.