Flipkart offer : ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ సంవత్సరంలోనే తన అతిపెద్ద సేల్ రాబోతోందని ప్రకటించింది. ఈ మేరకు సేల్ తేదీని కూడా ప్రకటించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వస్తున్న డీల్స్‌ని కూడా టీజ్ చేసింది. బ్యాంక్ ఆఫర్లను కూడా వెల్లడించింది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, హోమ్ నీడ్స్, ఇతర ఎలక్ట్రానిక్స్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం..
‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ – 2024’ సేల్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ మెంబర్షిప్ కలిగి ఉన్న కస్టమర్లు సెప్టెంబర్ 29 నుంచి కొన్ని పెద్ద డీల్స్, ఆఫర్లను ఆస్వాదించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ రూ. 499కి అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్‌పై షేర్ చేసిన టీజర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ పార్ట్నర్గా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
మీరు డిస్కౌంట్లు, ఆఫర్లు, అదనపు తగ్గింపులు పొందాలంటే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగించాలి. ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులందరికీ బెస్ట్ ఎక్స్ఛేంజ్, నో-కాస్ట్ ఈఎంఐలను అందజేస్తుందని టీజర్ తెలియజేస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024లో ఐఫోన్ 15 ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.
ఈ-కామర్స్ వెబ్సైట్ మోటో జీ85 (Moto g85), సామ్సంగ్ ఫోన్లతోపాటు వివో ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2024లో యాపిల్ వాచ్ సిరీస్ 9 ధర కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఫోన్లు కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా చౌకగా లభించనున్నాయి. సేల్ సమయంలో మీరు స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.