Flipkart Big Billion Days Sale | ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగల సీజన్ వచ్చేసింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.. కస్టమర్లకు ఆఫర్లతో స్పెషల్ సేల్స్ ప్రారంభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ శనివారం అర్థరాత్రి నుంచి ప్రారంభం అవుతున్నది. అయితే ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు శుక్రవారం అర్థరాత్రి నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-ఆఫర్లలో రూ.15 వేల లోపు ధర గల స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుండాం..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ ఇటీవలే భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉండే ఈ ఫోన్ 4జీబీ అండ్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.12,499 (ఎక్స్ షోరూమ్) కాగా, బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో రూ.11,499లకు లభిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్ మీ 11 5జీ, రియల్ మీ 11 ఎక్స్ 5జీ ఫోన్లను గత ఆగస్టులో ఆవిష్కరించింది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో భాగంగా రూ.2000 డిస్కౌంట్ ధరతో రూ.12,999లకు సొంతం చేసుకోవచ్చు. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.1000 రాయితీ పొందొచ్చు. రియల్ మీ 11 ఎక్స్ 5జీ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ ఎస్వోసీ చిప్ సెట్, మిడ్ నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ గత జూన్ నెలలో ఆవిష్కరించింది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఐపీఎస్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఇంటర్ సెల్లార్ బ్లూ, మ్యాజిక్ బ్లాక్, సన్ సెట్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999. కాగా రూ.13,999లకే లభిస్తుంది. బ్యాంకు కార్డులతో రూ.1000 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.
షియోమీ అనుబంధ రెడ్ మీ.. ఈ ఏడాది ప్రారంభంలో రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ ఆవిష్కరించింది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.17,999 కాగా, ఫ్లిప్ కార్ట్ సేల్ లో భాగంగా రూ.2000 డిస్కౌంట్.. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ఈ ఫోన్ రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు.
రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నది.
గత ఆగస్టులో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 6.46 అంగుళాల ఫుల్ హెచ్డీ + (2340×1080 పిక్సెల్స్) ఎస్ అమోలెడ్ డిస్ ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఒక్టాకోర్ ఎక్సోనోస్ 1280 ఎస్వోసీ చిప్ సెట్ ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్లాక్, మైస్టిక్ గ్రీన్, ఆర్చిడ్ వయోలెట్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.18,999లకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో భాగంగా రూ.2500, సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.1500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ఈ ఫోన్ రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. భారత్ మార్కెట్లోకి గత మార్చిలో ఆవిష్కరించిన పొకో ఎక్స్5 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.20,999లకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో డిస్కౌంట్ ధరపై రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు. స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ చిప్ సెట్, 6.67 అంగుళాల అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ 48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కలిగి ఉంటుంది.
ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన మోటరోలా జీ54 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.18,999. ఫ్లిప్ కార్ట్ సేల్స్ కింద రూ.15,999లకే లభిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై అదనంగా రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు.