Flipkart Axis Bank Credit Card | గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. ఈ-కామర్స్ లావాదేవీల్లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ రివార్డులు, వెల్కం బోనస్ తదితర రాయితీలు ఇవ్వడంతో క్రెడిట్ కార్డుల వాడకం ఎక్కువైంది. ఆయా ఈ-కామర్స్ సంస్థలు కూడా వివిధ బ్యాంకులతో కలిసి క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఆ జాబితాలోకి వస్తుంది ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌తోపాటు క్లియర్ ట్రిప్ వంటి దాని అఫిషియల్ పార్టనర్స్‌తో షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ పెంపుదలకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపకరిస్తుంది. కస్టమర్లకు పారదర్శకంగా క్రెడిబుల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిరంతరాయ షాపింగ్ సౌకర్యం కల్పించడమే ఈ క్రెడిట్ కార్డు లక్ష్యం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి వార్షిక ఫీజు రూ.500. ఈ కార్డు ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ బెనిఫిట్లు, ఇతర ఆఫర్లు తెలుసుకుందాం.
* ఫ్లిప్‌కార్ట్, క్లియర్ ట్రిప్ కొనుగోళ్లపై ఐదు శాతం క్యాష్ బ్యాక్.
* స్విగ్గీ, ఉబెర్, పీవీఆర్ వంటి సెలెక్టెడ్ పార్టనర్స్‌తో లావాదేవీలపై నాలుగు శాతం క్యాష్ బ్యాక్.
* ఇతర లావాదేవీలపై ఒకశాతం క్యాష్ బ్యాక్
ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తొలి ట్రాన్సాక్షన్ మీద రూ.500 విలువైన ఫ్లిప్‌కార్ట్ ఓచర్.
* గోబిబో (Goibibo), అమెజాన్ ఫ్రెష్ (Amazon Fresh), మేక్ మై ట్రిప్ (MakeMyTrip) వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లావాదేవీలపై ప్రతి బుధవారం స్పెషలాఫర్లు.
* ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఆర్డర్లపైనా డిస్కౌంట్
ఎయిర్పోర్ట్ లాంజ్ సర్వీస్: విమానాశ్రయాల్లో దేశీయ లాంజ్ల్లో ప్రతియేటా నాలుగు కాంప్లిమెంటరీ సర్వీస్. ప్రతి మూడు నెలల్లో కనీసం రూ.50 వేలు ఖర్చు చేసిన క్రెడిట్ కార్డు యూజర్లకు ఈ సర్వీస్
ఇంధన లావాదేవీలపై సర్చార్జీలో మాఫీ : ఇంధన వినియోగ లావాదేవీలపై ఒక శాతం సర్‌చార్జీ మాఫీ. ప్రతి నెలా రూ.400 నుంచి 4,000 వరకూ తప్పనిసరి లావాదేవీలు జరపాలి. ఇంధన వినియోగ లావాదేవీపై గరిష్టంగా రూ.400 బెనిఫిట్ లభిస్తుంది.
డైనింగ్ ఔట్ డిస్కౌంట్లు : సెలెక్టెడ్ పార్టనర్ రెస్టారెంట్లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడకంపై 15 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. యూజర్లు ఈ సర్వీసులను ఎంచుకునే ముందు షరతులు, నిబంధనలను జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది.
నిరంతరాయ ఈఎంఐ కన్వర్షన్ సర్వీస్: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,500 కంటే ఎక్కువ లావాదేవీలపై ఈజీ ఈఎంఐ ఆప్షన్. ఈ లావాదేవీలో ఖర్చు చేసిన మొత్తం మనీ సమాన ఈఎంఐల ద్వారా చెల్లించాలి.
18-70 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భారతీయులై ఉండటంతోపాటు నికరమైన ఆదాయం కలిగి ఉన్న వారు క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు కోసం సంబంధిత యూజర్లు వారి పాన్ కార్డ్, లేటెస్ట్ శాలరీ స్లిప్స్, ఫామ్-16 లేదా ఐటీఆర్ ఫైలింగ్ డాక్యుమెంట్స్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, యుటిలిటీ బిల్స్, ఓటర్ గుర్తింపు కార్డు వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్‌లో లావాదేవీలు జరిపే వారికి ఈ ‘ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు’ ఉపయోగంగా ఉంటుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా విమాన ప్రయాణం చేసే వారి కోసం పర్యటనల్లో రెస్టారెంట్లలో బస చేసే వారికి ఈ క్రెడిట్ కార్డు ఉపకరిస్తుంది. బెటర్ లైఫ్ స్టైల్, కుటుంబ బడ్జెట్ పట్ల శ్రద్ధ వహించే వారు కూడా ఈ క్రెడిట్ కార్డుతో బెనిఫిట్ పొందొచ్చు.