War Rooms @ Airports | ఉత్తరాదిలో దట్టమైన పొగ మంచు కురుస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు విమానాశ్రయాల పరిధిలో విమానాల రాకపోకలు జాప్యం అవుతున్నాయి. పొగ మంచు వల్ల విమానాల ఆలస్యం వల్ల తలెత్తే ఇబ్బందులను నివారించేందుకు విమానయాన సంస్థలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) జారీ చేసింది. ఈ ‘ఎస్వోపీ’లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ట్వీట్ చేశారు.
దేశంలోని ఆరు విమానాశ్రయాల పరిధిలో ఇబ్బందుల పరిష్కారానికి విమానయానశాఖ ‘వార్ రూమ్’లు ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో విమానాల రాకపోకలపై మూడుసార్లు నివేదిక ఇవ్వాలని ఎయిర్ లైన్స్‌ను ఆదేశించింది. ఆ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా విమానాశ్రయాలు ఉన్నాయి.
ప్రత్యేకించి ఢిల్లీ విమానాశ్రయ పరిధిలో దట్టమైన పొగ మంచు వల్ల విమాన సర్వీసుల షెడ్యూల్లో అంతరాయం ఏర్పడటంతో కేంద్ర పౌర విమానయాన శాఖ సోమవారం ఈ ‘ఎస్వోపీ’లను జారీ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. విమానయానశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ పర్యవేక్షిస్తుందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు.
In view of the fog-induced disruptions, Standard Operating Procedures (SOPs) on mitigating passenger inconvenience were issued yesterday to all the airlines.
1. In addition to these SOPs, we have sought incidence reporting thrice daily for all the 6 metro airports.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 16, 2024