న్యూఢిల్లీ, జనవరి 7: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పే సరికొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం సంస్థ ఐదు బ్యాంకులు, రెండు నాన్ బ్యాంకింగ్ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
కేవలం రూ.1,000 ప్రారంభంతో ఎంత వరకు అయిన డిపాజిట్ చేయవచ్చును. ఈ డిపాజిట్లపై 8 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నది. అలాగే సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న సంస్థ.. మహిళా ఇన్వెస్టర్లకు శ్రీరామ్ ఫైనాన్స్ మరో అర శాతం వడ్డీని చెల్లించనున్నది.