ధనవంతులు కావాలని మనలో ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందుకు కావాల్సిన ప్రణాళికల్లోనే తడబడుతారు. కానీ ఈ ఐదు సూత్రాలను పాటిస్తే సంపద మీ వెంటే. వాటిలో.. లక్ష్యం, బడ్జెట్, పెట్టుబడి, బీమా, అత్యవసర నిధి ఉన్నాయి.
లక్ష్యం: లక్ష్యం లేని ప్రయత్నం వృథా. అందుకే ఓ లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్తే విజయాన్ని సాధించవచ్చు.
బడ్జెట్: ఖర్చులను అదుపులో ఉంచుకున్నప్పుడే ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆస్కారం ఉంటుంది.
పెట్టుబడి: పెట్టుబడులు కూడా ప్రధానమే. సరైన ఆర్థిక సాధనాలను ఎంచుకొని పెట్టుబడులు పెడితే సంపద వృద్ధికి అవి దోహదం చేయగలవు.
బీమా: బీమా కూడా చాలా అవసరమైనదే. జీవిత, ఆరోగ్య బీమాలను తక్కువగా అంచనా వేయవద్దు.
అత్యవసర నిధి: రోజులు ఎలా ఉంటాయో? ఎవరికీ తెలియదు. అందు కే కనీసం 6 నెలలపాటు ఆదాయం లేకున్నా జీవించేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.