Zeiss Vision Center | హైదరాబాద్, ఏప్రిల్ 6: ఆప్టిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్ సైన్స్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థల్లో ఒకటైన జిస్..హైదరాబాద్‌లో తమ తొలి జిస్ విజన్ సెంటర్‌ను ప్రారంభించింది. స్పెక్స్‌బంకర్‌తో కలిసి జూబిలీహిల్స్, హైదరాబాద్‌లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా స్పెక్స్‌బంకర్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ అగర్వాల్ మాట్లాడుతూ..రెండేండ్ల క్రితం బెంగళూరులో ప్రారంభించిన జిస్ సెంటర్‌కు అనూహ్య స్పందన రావడంతో దక్షిణాదిలో మరో సెంటర్‌ను ప్రారంభించాలను ఉద్దేశంతో హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. భారత్‌లో కళ్లజోళ్ల పరిశ్రమకు పూర్వ వైభవం తేవడంతోపాటుగా కంటి సంరక్షణ ప్రమాణాలు పెంచడానికి ఈ విజన్ సెంటర్ దోహదం చేయనున్నదన్నారు. ఈ సెంటర్లో అంతర్జాతీయ ఫ్రేమ్‌లు, సన్గ్లాసె బ్రాండ్లతో పాటు లెన్స్‌లు కూడా లభించనున్నాయి.