ఆదాయం పన్ను రిటర్న్ (ఐటీఆర్)లను దాఖలు చేయడానికి ఉన్న చివరి గడువు డిసెంబర్ 31తో ముగిసిపోయింది. అయినాసరే ఐటీ పోర్టల్‌లో సమస్యలతోసహా అనేక కారణాలతో ఐటీఆర్ దాఖలు చేయలేకపోతే మార్చి 31లోగా దాఖలు చేసేందుకు వీలున్నది. అయితే దీనికి కొంత జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేస్తున్నందుకుగాను రూ.5,000 జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ ఆదాయం ఐదు లక్షలకులోపు ఉన్నట్టయితే, అలాగే మీకు ఎలాంటి టాక్స్ రిఫండ్ మీద వడ్డీ చెల్లింపులు రావాల్సి లేకపోతే మీరు రూ.1,000 జరిమాన చెల్లిస్తే చాలు. దీనికితోడు 2020-21 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉండాలి.