ఎగుమతులు డీలా.. గల్ఫ్ సంక్షోభం దెబ్బకు 2-3% పడిపోవచ్చు
దేశీయ వస్తూత్పత్తి ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 2-3 శాతం క్షీణించవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అంచనా వేస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణమని ఎఫ్ఐఈవో అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.
- భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య అంచనా
లుథియానా, ఏప్రిల్ 9 : దేశీయ వస్తూత్పత్తి ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 2-3 శాతం క్షీణించవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అంచనా వేస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణమని ఎఫ్ఐఈవో అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. గత నెల మార్చి ఎగుమతుల్లో 7-8 శాతం పతనం చూసే వీలుందన్నారు. ఈ నెల 15న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ 2025-26కు సంబంధించి దేశీయ ఎగుమతి-దిగుమతి గణాంకాలను వెల్లడించనున్న నేపథ్యంలో ఎఫ్ఐఈవో అంచనాలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేయడంతో యుద్ధం మొదలైన విషయం తెలిసిందే.
అప్పట్నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతుల్లో అంతరాయం కలుగుతున్నది. అంతేగాక నౌకలు, విమానాల్లో సరుకు రవాణా ఖర్చులు పెరుగడం, బీమా ఖరీదెక్కడం జరిగిపోయాయి. కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం.. సముద్ర రవాణాకు ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. అలాగే అమెరికా-ఇజ్రాయెల్‌కు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులకు దిగడంతో ఆయా దేశాలు తమ గగనతలాలపై ఆంక్షల్ని తీసుకురావడం.. విమానాల్లో సరుకు రవాణా వ్యయాన్ని పెంచేసింది. ఇక దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా, మెజారిటీ వాటా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ తదితర దేశాలదే. అయితే ఈ దేశాల్లోని ముడి చమురు, సహజ వాయువు ఉత్పాదక కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తుండటంతో ఉత్పత్తి ఆగిపోయింది.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా ఉక్కు, ప్లాస్టిక్, రబ్బర్ తదితర ముడి సరుకుల ధరలూ పెరిగాయని, ఇవన్నీ కూడా అంతిమంగా ఎగుమతుల్నే ప్రభావితం చేస్తున్నాయని రల్హాన్ వివరించారు. అయితే దేశీయ వస్తూత్పత్తి, సేవల ఎగుమతుల్ని కలిసి చూసినైట్టెతే గత ఆర్థిక సంవత్సరం 5-6 శాతం పెరుగుదల కనిపించవచ్చని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎగుమతులు 825 బిలియన్ డాలర్లు (వస్తూత్పత్తి ఎగుమతులు 437 బిలియన్ డాలర్లు, సేవల ఎగుమతులు 388 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి. కాగా, అమెరికా-ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ సంధితో నౌకల్లో సరుకు రవాణా తిరిగి ప్రారంభం కాగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా రల్హాన్ వ్యక్తం చేశారు. అయితే అధిక వడ్డీరేట్లు ఎగుమతిదారులకున్న రుణ లభ్యత అవకాశాలను దెబ్బతీస్తున్నాయని, ప్రభుత్వం ఈ విషయంలో ఊరట కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
- 2024-25లో గల్ఫ్ దేశాలతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 178 బిలియన్ డాలర్లు (రూ.16.55 లక్షల కోట్లు). ఎగుమతులు 56.87 బిలియన్ డాలర్లు, దిగుమతులు 121.67 బిలియన్ డాలర్లు.
- భారత్ నుంచి యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ (గల్ఫ్ రీజియన్) దేశాలకు సానబెట్టిన రత్నాలు, ఆభరణాలు, బియ్యం, ఔషధాలు ఎక్కువగా ఎగుమతి.
- గల్ఫ్ ఉద్రిక్తతల ఒత్తిడిలో భారతీయ పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వ్యవసాయం, ఔషధ, రత్నాలు, ఆభరణాల ఇండస్ట్రీలు.
- గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) నుంచి ముడి చమురు, ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ), పెట్రో కెమికల్స్ భారత్‌కు ఎక్కువగా దిగుమతి. సౌదీ అరేబియా వాటానే అధికం.
- గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు చమురేతర దిగుమతులూ జరుగుతున్నాయి. బంగారం, ముత్యాలు, విలువైన రత్నాలు ఇటీవలికాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

