FD Rates | ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) అనేది ఓ సురక్షిత పెట్టుబడి సాధనం. అంతేగాక హామీపూర్వక రాబడి పథకం కూడా. నిర్ధిష్ట రీతిలో చేసే ఏకకాల నగదు మొత్తాలపై నిర్ణీత కాలవ్యవధులకుగాను స్పష్టమైన వడ్డీరేట్లను ఇందులో చెల్లిస్తారు. పోస్టాఫీస్, ప్రభుత్వ-ప్రైవేట్ రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో ఎఫ్డీ స్కీములు అందుబాటులో ఉంటున్నాయి.
మార్కెట్ రిస్కులకు దూరంగా ఉండాలనుకునే మదుపరులకు ఈ ఎఫ్డీలు చక్కని పెట్టుబడి సాధనాలని చెప్పవచ్చు. అలాగే తమ పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని చూపుతూ మార్కెట్, నాన్-మార్కెట్ లింక్డ్ ఆప్షన్లను ఎంచుకోవాలనుకునేవారికీ ఎఫ్డీలు సరైనవే. అయితే సాధారణ డిపాజిటర్లకు, సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీరేట్లలో తేడాలూ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్‌కు కొంత ఎక్కువ మొత్తంలో ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వడ్డీరేటునిస్తున్నాయి.
కాగా, బ్యాంకులు రుణాలను ఎక్కువగా ఇస్తున్నాయని, డిపాజిట్లు మాత్రం తగ్గిపోతున్నాయని, రెండింటి మధ్య బ్యాలెన్స్ లేకపోతే చిక్కులు తప్పవని అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం ఎఫ్‌డీల వృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే డిపాజిటర్లను ఆకర్షించేందుకు వివిధ కాలపరిమితి ఎఫ్డీలపై ఇటీవల వడ్డీరేట్లను పెంచాయి. ప్రస్తుతం జనరల్, సీనియర్ సిటిజన్స్‌కు అత్యుత్తమ వడ్డీరేట్లు ఏ సంస్థల్లో, మరే టెన్యూర్స్‌పై ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.
ఎఫ్‌డీల్లో ఏయే రకాలు?