Fixed Deposits | సీనియర్ సిటిజన్లకు ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అత్యధిక వడ్డీరేట్లనిస్తున్నాయి. మొదట్నుంచీ మదుపరులకు సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎఫ్డీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ల పెట్టుబడులకు ఇవిప్పుడు చక్కని లాభసాటి మార్గంగా నిలుస్తున్నాయి. పైగా సెక్షన్ 80టీటీబీ కింద ఏ బ్యాంక్ డిపాజిట్ల ద్వారా పొందిన వడ్డీ ఆదాయంపైనైనా గరిష్ఠంగా పన్ను మినహాయింపును పొందే అవకాశం సీనియర్ డిపాజిటర్లకున్నది. ఏటా రూ.50వేలదాకా లబ్ధి పొందవచ్చు. ఇక కొన్ని బ్యాంకులు మెచ్యూరిటీ కంటే ముందే డిపాజిట్లను ఉపసంహరించుకున్నా ఎలాంటి జరిమానాలు వేయడం లేదు. రూ.5 లక్షల వరకుండే డిపాజిట్లకు బీమా సదుపాయం కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే. డిపాజిట్ చేసిన బ్యాంకులు దివాలా తీస్తే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
బ్యాంక్ వడ్డీరేటు(%)
ఇండియన్ ఓవర్సీస్ 7.60
బ్యాంక్ ఆఫ్ బరోడా 7.35
కెనరా 7.35
సెంట్రల్ బ్యాంక్ 7.35
బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.30
పీఎన్బీ 7.30
ఎస్బీఐ 7.30
యూనియన్ బ్యాంక్ 7.30
ఇండియన్ బ్యాంక్ 6.60
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో..
బంధన్ 8.55
ఇండస్ఇండ్ 8.25
ఆర్బీఎల్ 8.00
యెస్ 7.75
డీసీబీ 7.60
కొటక్ మహీంద్రా 7.60
డీబీఎస్ 7.50
ఫెడరల్ 7.50
కరూర్ వైశ్యా 7.40
సిటీ యూనియన్ 7.25
యాక్సిస్ 7.20
ఐసీఐసీఐ 7.20
సౌత్ ఇండియన్ 7.20
హెచ్డీఎఫ్సీ 7.10
ఐడీఎఫ్సీ ఫస్ట్ 7.00