ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 14, 2021 , 19:45:23

ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి.. లేదంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సిందే!

ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి.. లేదంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సిందే!

న్యూఢిల్లీ: ‌వాహ‌నాల‌కు ఆటోమేటిక్ టోల్‌ప్లాజా పేమెంట్ సిస్టం.. ఫాస్టాగ్ విధానం ఆదివారం అర్ధ‌రాత్రి (ఈ నెల 15) నుంచి తప్ప‌నిస‌రి కానున్న‌ది. త‌మ వాహనాల‌కు ఫాస్టాగ్ విధానాన్ని ఇన్‌స్టాల్ చేసుకునివారు రెట్టింపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంద‌ని కేంద్రం ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. క‌నుక వాహ‌నాలను న‌డిపేవారు ఇక‌ ఫాస్టాగ్ ఉంటేనే జాతీయ ర‌హ‌దారుల‌పైకి వెళ్లాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే పలుమార్లు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి వినియోగాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.. సోమ‌వారం నుంచి తప్పనిసరిగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఫాస్టాగ్‌ వినియోగంతో హైవేల‌పై టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర సమయం వృథా అయ్యే అవ‌కాశం ఉండ‌దు.

వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీనికోసం వాహన రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలను అందుబాటులో ఉంచుకోవాలి. వాహ‌నాల‌ను బ‌ట్టి ఫాస్టాగ్‌ ఖరీదు ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ను ఆన్‌లైన్‌ లేదా టోల్‌ప్లాజాల వద్ద చేయించుకోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo