హైదరాబాద్ జూన్ 24: ప్రముఖ జ్యుయెల్లర్ జోయాలుక్కాస్.. ‘సీతా కల్యాణం’ బ్రైడల్ కలెక్షన్ను ఆవిష్కరించింది. సంప్రదాయ భారతీయ విలువలను ఆదరించే నేటి పెండ్లి కూతుర్ల అభిరుచికి తగ్గట్టుగా ఈ నగలను డిజైన్ చేసినట్టు ఈ సందర్భంగా జోయాలుక్కాస్ గ్రూప్ సీఎండీ జాయ్ ఆలుక్కాస్ తెలిపారు.
ప్రతీ ఒక్క యువతి నచ్చే, మెచ్చే రీతిలో ఇవి ఉంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని షోరూంలలో ఈ కలెక్షన్స్ లభిస్తాయని చెప్పారు.