హైదరాబాద్, ఏప్రిల్ 21: ప్రముఖ ఐస్క్రీమ్ బ్రాండ్ బాస్కిన్ రాబిన్స్.. తెలంగాణలో తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో 37 రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఈ ఏడాది చివరినాటికి హైదరాబాద్లో మరో 10 వరకు కొత్త అవుట్లెట్లను ప్రారంభించినున్నది.
ఈ మేరకు గ్రావిస్ ఫుడ్స్ సీఈవో మోహిత్ ఖట్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 100 స్టోర్లను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. తెలంగాణలో 10 స్టోర్లనైనా తీసుకురావాల నుకుంటున్నది. కాగా, హైదరాబాద్ మార్కెట్లోకి కొత్తగా 17 ఉత్పత్తులను ఖట్టర్ శుక్రవారం విడుదల చేశారు.