మాదాపూర్, సెప్టెంబర్ 7: తనకు ఎలాంటి సంబంధం లేకపోయిన ఓ వ్యక్తి మరో వ్యక్తి పాన్, ఆధార్ కార్డును ఉపయోగించి అక్రమంగా మాదాపూర్లోని గుట్టలబేగంపేట్లో దొంగ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సృష్టించి భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు. ఈ దొంగ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సృష్టించడంతో బాధితుడికి రూ. 32.57 కోట్ల జరిమానా కట్టమని జీఎస్టీ శాఖ నోటీసును చూసి షాక్కు గురయ్యాడు. హైదరాబాద్లో తనకు ఎలాంటి వ్యాపారం లేదని, తన పేరుపై తెలియని వారు ఈ నేరానికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీకి చెందిన కార్తీక్ జైన్ అనే వ్యక్తి పేరుపై అక్రమంగా పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించి దొంగ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించి భారీ నేరానికి పాల్పడ్డారు. గత నెలలో హైదరాబాద్ జీఎస్టీ అడిషనల్ కమిషనర్ వీ వివేకానందరెడ్డిని కలిసి ఈ మోసానికి సంబంధించిన కీలక పత్రాలు అందచేశారు. దీంతో జీఎస్టీ రికార్డుల్లో యజమానిగా కార్తీక్ జైన్ అని ఉన్నప్పటి, ఆధార్ అథెంటికేషన్లోని తండ్రి పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఈ మెయిల్, ఫోన్ నంబర్లు బాధితుడి వివరాలతో సరిపోలేదు.