న్యూఢిల్లీ, మే 12: వినియోగదారులు వ్యయాల్ని తగ్గించుకోవడం, డిమాండ్ సన్నగిల్లడంతో దేశంలో పరిశ్రమల ఉత్పత్తి మందకొడిగానే కొనసాగుతున్నది. జాతీయ గణాంకాల శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022 మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి నిరుడు ఇదే నెలలో పోలిస్తే 1.9 శాతం మాత్రమే పెరిగింది. కొవిడ్ మూడో వేవ్ ప్రభావంతో ఈ ఏడాది జనవరి, పిభ్రవరి నెలల్లో ఇది 1.5 శాతంగానే నమోదయ్యింది.
గత ఏడాది మార్చిలో 24.2 శాతం ఉంది. వివరాలు:పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో భాగమైన విద్యుదుత్పత్తి ఈ మార్చి నెలలో 6.1 శాతంపెరగ్గా, గనుల ఉత్పత్తి 4 శాతం వృద్ధిచెందింది.
తయారీ రంగం కేవలం 0.9 శాతం వృద్ధినే సాధించడంతో మొత్తంగా ఐఐపీ వృద్ధి మందగించింది.
కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మార్చిలో 3.2 శాతం క్షీణించింది. 2021 మార్చిలో ఇది 59.9 శాతం వృద్ధిసాధించింది.