iPhone Discounts | మీరు ఐ-ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. వచ్చేనెలలో ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఐ-ఫోన్ 13 (iPhone 13), ఐ-ఫోన్ 14 (iPhone 14), ఐ-ఫోన్ 15 (iPhone 15)లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్లతోపాటు ప్రత్యేక వర్షాకాలం ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.
మీరు ఐ-ఫోన్ 15 కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే దాని ఎంఆర్పీ ప్రకారం రూ.79,900. విజయ్ సేల్స్ (Vijay Sales) ద్వారా 13 శాతం డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఆయా బ్యాంకుల కార్డులపై బ్యాంకులు ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు అందిస్తున్నాయి. దీనిమీద ఫ్లిప్కార్ట్ 16 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే రూ.62,889లకే సొంతం చేసుకోవచ్చు. పాత ఐ-ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే దాని పెర్ఫార్మెన్స్ ఆధారంగా రూ.50 వేల వరకూ రాయితీ పొందొచ్చు.
రెండేండ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఐ-ఫోన్ 14 ఎంఆర్పీ రూ.69,900. కాగా 13 శాతం డిస్కౌంట్ మీద రూ.60,990లకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఐ-ఫోన్ 14 ప్లస్ ఎంఆర్పీ రేటు రూ.79,600.. అయితే ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.56 వేలు చెల్లిస్తే సరి. అంటే 23 వేల పై చిలుకు రాయితీ లభిస్తుంది. తదుపరి సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్, యూపీఐ పేమెంట్స్ ద్వారా కొంటే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీని ప్రకారం ఐ-ఫోన్ 14 ప్లస్ రూ.55,499లకు సొంతం చేసుకోవచ్చు.
మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే ఐ-ఫోన్ 13 మంచి చాయిస్ అవుతుంది. దీని ధర రూ.52,999 కాగా, బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్స్ ట్రా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.