EV 2Wheelers | ఇప్పుడు కర్బన ఉద్గారాల నియంత్రణ.. పెట్రోల్ ధరలు భారీగా ఉండటంతో అందరూ ఆల్టర్నేటివ్ ఫ్యుయల్.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మళ్లుతున్నారు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఫేమ్-2 సబ్సిడీ అమలు చేసింది. దేశంలోని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కంపెనీలకూ ఈ సబ్సిడీలు అందాయి. కానీ, ఈవీ టూ వీలర్ కంపెనీలు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరించాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు చార్జర్లు అవసరం.. ఆ చార్జర్లకు కూడా ఫేమ్-2లో సబ్సిడీలు వర్తింపజేసింది కేంద్రం.
కానీ దేశంలోని టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థలు చార్జర్లకు కస్టమర్ల నుంచి ధరలు వసూలు చేశాయి. అలా వసూలు చేసిన సంస్థల్లో ఓలా ఎలక్ట్రిక్, ఎథేర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్స్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలు విక్రయించిన ఈవీ టూ వీలర్స్ ద్వారా రూ.306 కోట్లు వసూలు చేశాయి. కేవలం చార్జర్ మాత్రమే కాదు సాఫ్ట్వేర్ అప్డేట్ పేరిట మరికొంత సొమ్ము వసూలు చేశాయి. కానీ, సబ్సిడీ నిబంధన కింద కంపెనీలు చార్జర్‌కు కూడా విడిగా మనీ వసూలు చేయకూడదు.
చార్జర్లకు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కంపెనీలు మనీ వసూలు చేసిన సంగతి కనిపెట్టిన కేంద్రం.. ఆయా కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నోటీస్ అందుకోగానే నాలుగు కంపెనీలు కూడా 100 శాతం చార్జర్ సొమ్ము కస్టమర్లకు రీఫండ్ చేస్తామని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) కి సమాచారం. కానీ, కంపెనీలు ఇప్పుడు మాట మార్చాయి. కస్టమర్ల బ్యాంకు ఖాతాల వివరాలు తమకు అందుబాటులో లేవని, అందుకే చార్జర్ ధర, సాఫ్ట్వేర్ అప్డేట్ పేరిట వసూలు చేసిన మొత్తం రీఫండ్ చేయడంలో ఆలస్యమవుతుందని వాదిస్తున్నాయి.
కంపెనీ —— కస్టమర్లు — రీఫండ్ చేయాల్సిన మొత్తం – రీఫండ్ చేసిన మొత్తం
ఎథేర్ ——- 95 వేలు — రూ.157.78 కోట్లు ——— రూ.3.97 కోట్లు
వెట్ ———- లక్ష ——– రూ.130 కోట్లు ———– రూ.4.25 కోట్లు
టీవీఎస్ ——– 87 వేలు —— రూ.15.6 కోట్లు ———- రూ.9 లక్షలు
హీరోమోటో — 1,100 ——- రూ.2.26 కోట్లు ——— రూ.1.64 కోట్లు
ఫేమ్-2 కింద 2019లో కేంద్రం రూ.10 వేల కోట్లు కేటాయించింది. 2023-24లో రూ.5,172 కోట్లు కేటాయిస్తే రూ.3,701 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుతం రూ.5172 కోట్లు కేటాయించింది.