అదానీ చేతికి ఎస్సార్ ట్రాన్స్మిషన్ లైన్
అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌కు తమ రెండు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్లలో ఒకదాన్ని రూ.1,913 కోట్లకు అమ్ముతున్నట్టు ఎస్సార్ పవర్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్టు ఓ ప్రకటనలో చెప్పింది.
- డీల్ విలువ రూ.1,913 కోట్లు
న్యూఢిల్లీ, జూన్ 3: అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌కు తమ రెండు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్లలో ఒకదాన్ని రూ.1,913 కోట్లకు అమ్ముతున్నట్టు ఎస్సార్ పవర్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్టు ఓ ప్రకటనలో చెప్పింది. కాగా, గత మూడేండ్లలో బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు రూ.1.8 లక్షల కోట్లకుపైగా బకాయిలను ఎస్సార్ తిరిగి చెల్లించిన విషయం తెలిసిందే.
ఈ స్థాయిలో రుణాల చెల్లింపులు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే సంస్థాగత వ్యూహంలో భాగంగా ఓ ట్రాన్స్మిషన్ లైన్‌ను అదానీకి ఎస్సార్ విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక మూడు రాష్ర్టాల్లో ఎస్సార్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్‌కు 465 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లున్నాయి. భారత్, కెనడాల్లో ఉన్న నాలుగు ప్లాంట్ల ద్వారా ప్రస్తుతం 2,070 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ఎస్సార్ పవర్ చేస్తున్నది. మరోవైపు ఈ లావాదేవీతో అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ నెట్వర్క్ 19,468 సర్క్యుట్ కిలోమీటర్లను తాకనున్నది. మొత్తానికి అన్ని రంగాల్లో అదానీ విస్తరణ బాట పడుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- adani
- adani transmission
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

