
న్యూఢిల్లీ, నవంబర్ 15: వ్యవసాయ, నిర్మాణ రంగానికి చెందిన ఉత్పత్తుల సంస్థ ఎస్కార్ట్..ట్రాక్టర్ కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఈ నెల 21 నుంచి ట్రాక్టర్ ధరలను పెంచుతున్నట్లు సోమవారం తాజాగా ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎంత శాతం పెంచుతున్నదో మాత్రం సంస్థ వెల్లడించలేదు. గత కొన్ని నెలలుగా కమోడిటీ ఉత్పత్తులు నిరాటంకంగా పెరుగుతూ వస్తున్నాయని, దీంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా అన్ని మోడళ్ళ ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది.