న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : వ్యవసాయ, నిర్మాణ రంగ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్ ..వచ్చే నెల నుంచి ట్రాక్టర్ల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. క్యూబాటో బ్రాండ్‌తో విక్రయిస్తున్న ట్రాక్టర్ల ధరలు వచ్చే నెల 1 నుంచి మరింత ప్రియంకాబోతున్నాయి. ఈ విషయాన్ని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.