Gold and Silver | పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం.. వెండి, బంగారం ధరలు పతనం
Gold and Silver | ఈ ఏడాది ప్రారంభంలో ఆకాశాన్నంటిన బంగారం, వెండి (Gold, Silver) ధరలు గత కొన్ని రోజుల నుంచి దిగి వస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాల మెరుపులు తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్ (International Market) లో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి.
Gold and Silver : ఈ ఏడాది ప్రారంభంలో ఆకాశాన్నంటిన బంగారం, వెండి (Gold, Silver) ధరలు గత కొన్ని రోజుల నుంచి దిగి వస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాల మెరుపులు తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్ (International Market) లో బంగారం, వెండి ధరలు భారీగా క్షీణించాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 4377.95 డాలర్లకు దిగొచ్చి నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది.
స్పాట్ గోల్డ్ ధర తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో రోజు కావడం గమనార్హం. గతవారం ఆరంభంలో ఈ పసిడి ధర 5000 డాలర్లపైన పలికింది. అటు వెండి ధర 65.74 డాలర్లకు పతమైంది. ఇక దేశీయంగానూ ఈ లోహాలకు గిరాకీ తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో 10 గ్రాముల బంగారం ధర నేడు 4.59 శాతం తగ్గి రూ.1,37,862 వద్ద కొనసాగుతోంది. మే ఫ్యూచర్స్‌లో వెండి ధర 5.70 శాతం పతనమై కేజీ ధర రూ.2.13 లక్షలుగా ట్రేడవుతోంది.
హైదరాబాద్‌లో సోమవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,43,390గా ఉంది. కేజీ వెండి ధర రూ.2.20 లక్షలు పలికింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెచ్చుమీరుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉద్రిక్తతల ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించవచ్చన్న అంచనాలకు తోడు డాలర్ బలోపేతం కావడం.. బంగారం, వెండి ధరలపై పెను ప్రభావం చూపుతోంది.
అంతేగాక యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడం కూడా ఈ లోహాల ధరల పతనానికి కారణమని బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

