
కొచ్చి, సెప్టెంబర్ 21: దక్షిణాది రాష్ర్టాల్లో విస్తరణపై దృష్టి పెట్టింది హైపర్ లోకల్ డెలివరీ స్టార్టప్ ఎరాండో. సొంతంగా పంపిణీ వ్యవస్థ లేని ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు బీటుబీ సేవలను అందించే ఎరాండో.. హైదరాబాద్‌సహా 6 నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నది. దీంతో ఈ కేరళకు చెందిన సంస్థ డెలివరీ వాహనాలు హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, మైసూర్, మంగళూరు, త్రిస్సూరుల్లో సర్వీస్ ఇవ్వనున్నాయి. కాగా, ఈ విస్తరణతో దాదాపు 100కుపైగా ఉద్యోగావకాశాలూ రానున్నాయని మంగళవారం కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం తిరువనంతపురం, కొచ్చి, కోజోకోడ్, బెంగళూరు నగరాల్లోనే సంస్థ సేవలున్నాయి.