Mutual Funds | దీర్ఘకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతారా?.. ఇవి తెలుసుకోండి!
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అధిక రాబడులనిస్తాయి. అయితే రిస్క్ కూడా ఎక్కువ. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్లు స్థిరమైన రాబడులనిస్తాయి. పైగా రిస్క్ తక్కువ. అందుకే రిస్క్‌ను ఇష్టపడని ఇన్వెస్టర్లకు ఇవి అనుకూలమని నిపుణులు చెప్తున్నారు.
Mutual Funds | డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అధిక రాబడులనిస్తాయి. అయితే రిస్క్ కూడా ఎక్కువ. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్లు స్థిరమైన రాబడులనిస్తాయి. పైగా రిస్క్ తక్కువ. అందుకే రిస్క్‌ను ఇష్టపడని ఇన్వెస్టర్లకు ఇవి అనుకూలమని నిపుణులు చెప్తున్నారు. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్‌తో ఆదాయం ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్లలో వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం పెరుగుతూ ఉంటుంది.
? దీర్ఘకాల డెట్ మ్యూచువల్ ఫండ్స్ సగటు మెచ్యూరిటీ వ్యవధి ఎంత
36 నెలలపైనే.
? ఈ దీర్ఘకాల మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ పెట్టుబడులు పెడుతాయి
ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, బ్యాంకులు జారీచేసే బాండ్లు.
? దీర్ఘకాల ఫండ్స్ ఫీచర్లు ఏమిటి
వడ్డీరేట్లలో మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వడ్డీరేట్లు పడిపోతే ఫండ్ నికర ఆస్తి విలువ అనుకూలంగా, వడ్డీరేట్లు పెరిగితే ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.
? దీర్ఘకాలిక ఫండ్లకు కొన్ని ఉదాహరణలు
ఇన్కమ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్.
? ఈ దీర్ఘకాలిక డెట్ మ్యూచువల్ ఫండ్లు ఎవరికి అనుకూలం
దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనే లక్ష్యంగా మదుపు చేసే ఇన్వెస్టర్లకు ఇవి అనుకూలం.
టాప్-అప్ సిప్‌లతో ఈ ప్రయోజనాలు తెలుసా?
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) సులువైన, అనువైన మార్గం. నెలవారీగా, త్రైమాసికాలవారీగా వీలైన పెట్టుబడులకు సిప్‌లు అవకాశం కల్పిస్తాయి. ఏకమొత్తంగా కాకుండా కొద్ది మొత్తాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఉపక్రమించవచ్చు. ఈ క్రమంలోనే టాప్-అప్ సిప్లూ ఇప్పుడు మార్కెట్లో ఫేమస్ అయిపోయాయి. అయితే ఈ టాప్-అప్ సిప్‌లలో ఉన్న ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
? టాప్-అప్ సిప్ అంటే
నిర్ణీత కాలనుగుణంగా సిప్ అమౌంట్ దానంతటదే పెరగడానికి ఇవి దోహదం చేస్తాయి.
? ఎలా ఉపయోగపడుతాయి
ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకుని సాగే ఈ టాప్-అప్ సిప్‌లు.. కాలనుగుణంగా మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు కృషి చేస్తాయి.
? అధిక ఆదాయం-అధిక పొదుపు
మీ ఆదాయానికి తగ్గట్టుగా పొదుపునకు ఈ టాప్-అప్ సిప్‌లు సహాయపడుతాయి. అలాగే రెగ్యులర్ ఇన్కమ్నూ పెంచుతూపోతాయి.
? మదుపు సులభతరమవుతుందా
కొత్త సిప్‌లు, ఒకటికి మించి ఉన్న సిప్ల పర్యవేక్షణలో టాప్-అప్ సిప్‌లు.. ఇన్వెస్టర్లపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి.
? ఎలా మొదలుపెట్టాలి
సిప్‌ను ప్రారంభించేటప్పుడే టాప్-అప్ సిప్ ఆప్షన్‌ను మదుపరులు ఎంచుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

