Investers Wealth | ఈక్విటీ మార్కెట్లలో అన్ని సెక్టార్ల స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఇన్వెస్టర్ల సంపద రూ.7.30 లక్షల కోట్లు పెరిగింది. అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న భయాలు తొలగి పోవడంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1339.96 పాయింట్ల లబ్ధితో 80,436.84 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండున్నర నెలల్లో ఇండెక్సులు అత్యధికంగా లాభ పడటం ఇదే తొలిసారి. శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,412.33 పాయింట్లు పుంజుకుని 80,518.21 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,30,389.86 కోట్లు వృద్ధి చెంది 4,51,59,833.55 (5.38 లక్షల కోట్ల డాలర్లు) కోట్లకు చేరుకున్నది.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.80 శాతం, స్మాల్ క్యాప్ 1.70 శాతం లాభ పడ్డాయి. అన్ని ఇండెక్సులు దూసుకెళ్లాయి. ఐటీ ఇండెక్స్ 2.72 శాతం, రియాల్టీ 2.45, టెక్ 2.23, ఆటో 1.90, కమోడిటీస్ 1.89, పవర్ 1.80, ఫైనాన్సియల్ సర్వీసెస్ 1.77 శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ 1.74 శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈలో 2462 స్టాక్స్ లాభాలతో ముగిస్తే 1467 స్టాక్స్ నష్టాలతో స్థిర పడ్డాయి. మరో 107 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!