ముంబై, మే 11: అధిక పెన్షన్ కోరుతూ దరఖాస్తు చేసే ఈపీఎఫ్‌వో చందాదారులు, పెన్షనర్లు అవసరమైన అదనపు సొమ్మును డిపాజిట్ చేయడానికి లేదా పీఎఫ్ ఖాతా నుంచి పెన్షన్ స్కీమ్‌కు బదిలీ చేయాలన్న అనుమతి తెలిపేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మూడు నెలల గడువు ప్రకటించింది.
ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్ జారీచేసింది. ఉద్యోగులు/పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం యాజమాన్యాలతో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ను ఆన్లైన్లో సమర్పించేందుకు గడువు తేదీని 2023 జూన్ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ పెన్షన్‌కు అవసరమైన అదనపు మొత్తం చెల్లించే అంశం, చెల్లించాల్సిన మొత్తం భారీగా ఉంటే అధిక పెన్షన్ స్కీమ్ నుంచి ఉపసంహరించుకునే ఆప్షన్ ఉందా అనే అంశంపై ఉద్యోగులు/పెన్షనర్లకు అవగాహన లేదు. ఈ అంశాలపై స్పష్టత ఇస్తూ జారీచేసిన తాజా సర్క్యులర్ వివరాలివి…