న్యూఢిల్లీ, నవంబర్ 10: దీపావళి పండుగ సమయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) చందాదారుల పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ జమచేయడం ప్రారంభించినట్టు కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.15 శాతం వడ్డీ మొత్తాన్ని జమచేసే ప్రక్రియ కొనసాగుతున్నదని ఇప్పటికే 24 కోట్లకుపైగా ఖాతాల్లో క్రెడిట్ చేసినట్టు శుక్రవారం మంత్రి ఎక్స్ పోస్టులో వెల్లడించారు. చందాదారులు వారి పీఎఫ్ ఖాతాల్లో బ్యాలెన్స్‌ను పలు మార్గాల్లో చెక్ చేసుకోవచ్చు. రిజిష్టర్డ్ మొబైల్ ద్వారా ఈపీఎఫ్‌వోకు టెక్ట్స్ మెసేజ్, మిస్డ్ కాల్ చేస్తే బ్యాలెన్స్ తెలుస్తుంది. స్మార్ట్ఫోన్లలో ఉమాంగ్ యాప్ ద్వారా, ఈపీఎఫ్‌వో వెబ్సైట్లో యూఏఎన్ నంబర్‌తో లాగిన్ అయ్యి కూడా చూసుకోవచ్చు.